సర్పంచ్ అయినా సామాన్య వ్యక్తే

★ ​ఆడంబరాలు, అధికార అహంకారమెరగని సాధారణ మన్ను మనిషి.. ★ పార పట్టి పరిష్కారం బాటలో పంచాయతీ సర్పంచ్!

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 5 మధిర ప్రతినిధి మధిర మండలం, రాయపట్నం గ్రామ పంచాయతీ పరిధిలో గత కొంతకాలంగా అనేక చోట్ల మంచినీటి పైపులైన్లు లీకేజీ అవుతూ గ్రామస్థులకు నీటి సరఫరాలో ఇబ్బందులు ఎదురవకుండా. సమస్య చిన్నదైనా, దాని వల్ల కలిగే నీటి వృథా మరియు ప్రజల ఇబ్బంది పెద్దదని గుర్తించిన గ్రామ సర్పంచ్ కంచం గోపి గ్రామ సమస్యలను తమ సొంత ఇంటి పనిలా భావించి.. క్షేత్ర స్థాయిలో పనిలో నిమగ్నమై, కూలీల కష్టంలో భుజం కలిపి పరిష్కారం చూపడం జరిగింది. ప్రజా దీవెనలతో ప్రతి పని పరిష్కారం సర్పంచ్ అంటే కేవలం సంతకాలు పెట్టడమే కాదు, సామాన్య వ్యక్తిలా శ్రమిస్తున్నాడు అంటున్న గ్రామ ప్రజలు.