సింగరేణి అధికారులు నిర్లక్ష్యం

* 25 లక్షల తో నిర్మించిన చికెన్, మటన్,మార్కెట్ * సెంటినరీ కాలనీ లో నిరుపయోగంగా నాన్ వెజ్ మార్కెట్ * శిథిలావస్థకు వచ్చిన ప్రారంభోత్సవానికి నోచుకోని మార్కెట్ * పలుమార్లు సింగరేణి దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోని అధికారులు * బిజెపి సీనియర్ నాయకులు మొలుమూరి శ్రీనివాస్

పయనించే సూర్యుడు న్యూస్: పెద్దపల్లి, సెంటినరీ కాలనీ -05 సెంటినరీ కాలనీలో మాంసం దుకాణాలన్నీ ఒకే దగ్గర ఏర్పాటు చేయాలని సింగరేణి యజమాన్యం కార్మికుల సౌకర్యం కోసం 25 లక్షలు వెచ్చించి ఆరు సంవత్సరాల క్రితం మార్కెట్ సముదాయాన్ని నిర్మించారని ఇప్పటివరకు కూడా ప్రారంభించకపోవడం శోచనీయమని బిజెపి జిల్లా సీనియర్ నాయకులు మొలుమూరి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… చికెన్,మటన్, మార్కెట్ సముదాయంలో ఒకే దగ్గర వినియోగంలోకి తెచ్చే విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. ఈ మార్కెట్ ప్రాంగణం అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారిందన్నారు. ఈ మార్కెట్ వినియోగంలోకి తెచ్చేందుకు యూనియన్ నాయకులు చొరవ తీసుకోవాలని అన్నారు. జిల్లా కేంద్రమైన పెద్దపల్లిలో కంటే సెంటనరీ కాలనీలో మాంసం రేట్లు అధికంగా షాపు నిర్వాహకులు అమ్ముతున్నారన్నారు.సింగరేణి పారిశ్రామిక ప్రాంతమైన ఆర్జి-II ఎనిమిదవ కాలనీలో ఒకే దగ్గర ఉన్న మాంసం దుకాణాలు ఇక్కడ ఎందుకు సింగరేణి యాజమాన్యం నిర్వహించడం లేదన్నారు.ఇప్పటికైనా సింగరేణి అధికారులు నాన్ వెజ్ మార్కెట్ ను నిర్వహించే విధంగా చూడాలని లేకపోతే బిజెపి ఆధ్వర్యంలో జి ఎం ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *