ఎస్సీ విద్యార్థులకు సువర్ణావకాశం: ‘శ్రేష్ఠ’ పథకం ద్వారా ఉచిత విద్య

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ ఏప్రిల్ 06.04.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం ప్రతినిధి జె. నాగరాజ) షెడ్యూల్డ్ కులాలకు (ఎస్ సి) లకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా దేశంలోని ప్రముఖ ప్రైవేట్ (సీబీఎస్ఈ ) స్కూళ్లలో 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచితంగా చదువుకోవచ్చు. పథకం ప్రయోజనాలు:
పూర్తి ఉచితం: స్కూల్ ఫీజు, హాస్టల్ ఫీజు మరియు మెస్ ఖర్చులు అన్నీ ప్రభుత్వమే భరిస్తుంది. స్కాలర్‌షిప్: 9వ తరగతికి: 1,00,000 10వ తరగతికి: ₹1,10,000 11వ తరగతికి: ₹1,25,000 12వ తరగతికి: ₹1,35,000 క్వాలిటీ ఎడ్యుకేషన్: దేశంలోని టాప్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదివే అవకాశం. అర్హతలు: విద్యార్థి తప్పనిసరిగా ఎస్సీ (ఎస్ సి) వర్గానికి చెందినవారై ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం ₹2.5 లక్షల లోపు ఉండాలి. ప్రస్తుతం 8వ తరగతి లేదా 10వ తరగతి చదువుతున్న వారు (9 లేదా 11లో చేరడానికి) అర్హులు. ఎంపిక విధానం: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ ప్రవేశ పరీక్ష శ్రేష్టద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు ముఖ్యమైన లింకులు: 1. అధికారిక వెబ్‌సైట్: https://shreshta.nta.nic.in/ 2. రిజిస్ట్రేషన్ లింక్: https://exams.nta. ac.in/SHRESHTA/ 3. సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ: https://socialjustice.gov.in/ గమనిక: దరఖాస్తు గడువు మరియు పరీక్ష తేదీల కోసం పైన ఉన్న NTA వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా సందర్శించండి. మీకు తెలిసిన ఎస్సీ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు ఈ సమాచారాన్ని షేర్ చేయండి. ఒక చిన్న షేర్ ఒక విద్యార్థి భవిష్యత్తును మార్చగల దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *