ఐదు కోట్ల ప్రజల కలల రాజధాని అమరావతి

తమ నివాసంలో దీపం వెలిగించి ఆనందం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం ఏప్రిల్ 6 జగయ్యపేట్ట పట్టణంలోని ఈరోజు పార్లమెంటులో అమరావతిని రాజధానిగా ప్రకటించే బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా జగ్గయ్యపేట పట్టణంలోని శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) తన నివాసంలో దీపం వెలిగించి ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం పెనుగంచిప్రోలు మండలం, ముండ్లపాడు గ్రామంలో స్థానిక నాయకులతో కలిసి దీపాలు వెలిగించి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) మాట్లాడుతూ: అమరావతి రాజధాని నిర్మాణం రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది అవుతుందని, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఐక్య సంకల్పానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందడం ద్వారా రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం సాకారం దిశగా కీలక ముందడుగు పడిందని పేర్కొన్నారు. అమరావతి అభివృద్ధి పునఃప్రారంభంతో రాష్ట్రంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరిగి ఆర్థిక వ్య వస్థ వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చారిత్రాత్మక నిర్ణయానికి సహకరించిన కేంద్ర మరియు రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అమరావతి నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు మరియు ముండ్లపాడు గ్రామ నాయకులు, మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.