మున్సిపల్ కార్యాలయంలో జగ్జీవన్ రామ్ వేడుకలు: పాల్గొన్న కౌన్సిలర్లు, అధికారులు

దేశ సేవలో జగ్జీవన్ రామ్ మార్గదర్శకం: చైర్‌పర్సన్ కోనేటి పుష్పలత

పయనించే సూర్యుడు ఏప్రిల్ 06, మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ నరిగె కళా శేఖర్: జడ్చర్ల స్థానిక పురపాలక సంఘ కార్యాలయంలో భారత మాజీ ఉప ప్రధాని, బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి కోనేటి పుష్పలత మాట్లాడుతూ.. దేశ అభివృద్ధికి, అణగారిన వర్గాల సంక్షేమానికి జగ్జీవన్ రామ్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు శ్రీ ఉమా శంకర్ గౌడ్, శ్రీ కోట్ల ప్రశాంత్ రెడ్డి, శ్రీ సుంక సారీ రమేష్, శ్రీమతి లత, శ్రీ బుక్క మహేష్ పాల్గొన్నారు. వీరితో పాటు శానిటేషన్ ఇన్స్పెక్టర్ శ్రీ నరేష్, నాయకులు నర్సింలు, కొండల్, గుండు విజయ్ (కంప్యూటర్ ఆపరేటర్), వార్డు ఆఫీసర్లు డి. కృష్ణయ్య, శ్రావణ్, శివప్రసాద్, వైష్ణవి మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *