పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 6 మందమర్రి మండల ప్రతినిధి బొద్దుల భూమయ్య మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మందమర్రి మండలం కేతనపల్లి మున్సిపాలిటీ లో గత కొద్ది రోజులుగా మున్సిపాలిటీలో నెలకొన్న రాజకీయ ఉత్కంఠకు తెరపడింది చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో టిఆర్ఎస్ సీపీఐ పార్టీల కౌన్సిలర్లు ఎన్నికకు హాజరయ్యారు ఎన్నికల నిర్వహణ అధికారులు పూర్తి తనిఖీల అనంతరం కౌన్సిలర్ లను మున్సిపాలిటీ కార్యాలయంలోకి అనుమతించారు చైర్ పర్సన్ గా గొడిసెల సంధ్యారాణి వైస్ చైర్మన్ గా మిట్టపల్లి సరిత ఎన్నికయ్యారు ఎన్నికలకు కాంగ్రెస్ కౌన్సిలర్లు గైర్హాజరు కావడంతో మెజారిటీ సభ్యుల మద్దతుతో వీరిద్దరు ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి చంద్రయ్య అధికారికంగా ప్రకటించారు నూతనంగా ఎన్నికైన పాలకవర్గానికి టిఆర్ఎస్ నాయకులు మరియు సిపిఐ నాయకులు అభినందనలు తెలిపారు..