గుప్పుమంటున్నా గుడుంబా

★ కిరాణా దుకాణల్లో నల్ల బెల్లం విక్రయాలు ★ పల్లెల్లో గుడుంబా బట్టీలు ★ విక్రయదారులపైనే అధికారుల ప్రతాపం.. ★ సరఫరా చేస్తున్న వారిని పట్టించుకోని వైనం..

పయనించే సూర్యుడు న్యూస్ మెట్‌పల్లి ఏప్రిల్ 6 పల్లెల్లో గుడుంబా మళ్ళీ గుప్పు మంటోంది. గుడుంబా రహిత పల్లెలుగా ప్రకటించాలని అప్పటి  సీఎం కేసీఆర్ ఆయా ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులకు సూచించడంతో  ఆ మేరకు గుడుంబా మాయమైంది. కొన్ని రోజులు గుడుంబా నియంత్రణ జరిగిన  మళ్లీ గుడుంబా అమ్మకాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. మారుమూల ప్రాంతాలను అడ్డాగా చేసుకొని గుడుంబా తయారీని కొనసాగిస్తున్నారు.? అధికారులు అప్పుడప్పుడు దాడులు  చేపడుతున్న తనిఖీల్లో పట్టుబడుతున్నా దందామాత్రం ఆగడం లేదు. ఎక్సైజ్ పరిధిలోని కోరుట్ల,మెట్‌పల్లి, కథలాపూర్, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండలాల పరిధిలోని గిరిజన, అటవీ ప్రాంతాల్లో గుడుంబాను తయారు చేస్తున్నారు. తక్కువ ధరకే ఎక్కువ మత్తు రావడంతో ప్రజలు గుడుంబా కు బానిసలుగా మారుతున్నారు. పెరిగిన నల్ల బెల్లం విక్రయాలు కోరుట్ల,మెట్‌పల్లి, కథలాపూర్, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండలలలో నల్లబెల్లం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఆయా మండలాల పరిధిలోని కిరాణా షాపుల్లో నల్ల బెల్లం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.దానికి తోడు అత్యాశతో గుడుంబా తయారీలో స్పిరిట్‌ ద్రావణం, జీడిగింజల మిశ్రమం, యూరియా, నల్లచెక్క లాంటి ప్రమాదకర ఘాటు పదార్థాలను కలపడంతో ప్రజల ఆరోగ్యం చెడిపోవడమే కాకుండా ప్రాణప్రాయ స్థితిలోకి నెట్టి వేస్తుంది.ఇంత జరుగుతున్నా గుడుంబా నియంత్రణ, నల్ల బెల్లం విక్రయాలు అరికట్టేందుకు మాత్రం అధికారులు చర్యలు తీసుకోవడం లేదని బహిరంగంగానే చెబుతున్నారు. పల్లెల్లో తయారీ పట్టణాల్లో అమ్మకాలు.. పల్లెల్లో గుట్టుచప్పడు కాకుండా గుడుంబాను పలువురు తయారు చేస్తున్నారు. సమీప ప్రాంతాల్లోని పట్టణాలకు తరలించి విక్రయాలు జరుపుతున్నారు. పట్టణాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ఏజెంట్ల ద్వారా గుడుంబా విక్రయాలు చేస్తున్నారు.  పలు గ్రామాల నుంచి నిత్యం వందల లీటర్ల గుడుంబాను పట్టణాలకు తరలిస్తున్నారు. గతంలో విడిగా గుడుంబా విక్రయాలు జరగగా ప్రస్తుతం మాత్రం ప్యాకెట్లలో నింపి విక్రయాలు జరుపుతున్నారు. విక్రయదారులపైనే అధికారుల ప్రతాపం.. నియోజకవర్గ పరిధిలోని ఆయా మండలాల్లోని పల్లెల్లో గుడుంబా విచ్చల విడిగా తయారు చేస్తున్న అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడడం లేదని. కేవలం దానిని కొనుగోలు చేసి పొట్టకూటి కోసం విక్రయిస్తున్న వారి పై మాత్రమే కేసులు నమోదు చేస్తూ, బైండోవర్ ల పేరుతో అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని. గుడుంబా తయారీ దారులను నియంత్రించాకుండా, విక్రయదారులపై తమ ప్రతాపం చూపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుడుంబా తయారీ ని పూర్తిగా నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు. సరఫరా చేస్తున్న వారిని పట్టించుకోని అధికారులు.. నిషేధిత గుడుంబా ఆయా మండలాల అటవీ ప్రాంతం నుండి లీటర్ల కొద్దీ విక్రయదారులకు నిర్వాహకులు సరఫరా చేస్తున్న ఎక్సైజ్ అధికారులు మాత్రం వారిని పట్టించుకోవడం లేదని పలువురు చర్చించుకుంటున్నారు. కొందరు గుడుంబా తయారీ దారులు వేకువజామున, రాత్రి వేళల్లో ఎస్సారెస్పీ కెనాల్ వెంబడి, అటవీ ప్రాంతాల్లోనుండి గుట్టుచప్పుడు కాకుండా సరఫరా చేస్తున్నారని వారికి ఎక్సైజ్ కార్యాలయంలోని కొందరు సిబ్బంది సహకరిస్తూ అధికారుల దాడుల విషయం చేరవేస్తూ అలర్ట్ చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా నియంత్రించవలసిన వారే సహకరిస్తున్నట్లు  తెలుస్తుంది