ఘనంగా బాబు జగ్జీవన్ రాం 119వ జయంతి వేడుకలు

పయనించే సూర్యుడు, ఏప్రిల్ 6 ,బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. బచ్చన్నపేట మండల కేంద్రంలో బాబు జగ్జీవన్ రామ్ 119 వ జయంతి ఉత్సవాలు అంబేద్కర్ జగ్జీవన్ రావ్ విగ్రహ ప్రతిష్టాపన కమిటీ అధ్యక్షులు కంత్రి సత్తయ్య ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా కంత్రి సత్తయ్య హవహింగా ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ అల్వాల నర్సింగరావు పాల్గొని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి ప్రతిష్టాపన కమిటీ సభ్యులతో కలిసి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు . ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు ఎమ్మార్పీఎస్ నాయకులు ప్రజా సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ యొక్క సేవలను బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరుగని కృషి చేసిన సంఘసంస్కర్త మరియు అస్పృశ్యత అంటరానితనం నిర్మూలన కోసం,బడుగు బలహీన వర్గాల ఓటు హక్కు కోసం పోరాటం చేసిన స్వాతంత్ర సమరయోధులు భారతదేశ మొట్టమొదటి ఉప ప్రధాని అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం చేసిన కృషి మరువలేనిది అన్నారు. ఈ కార్యక్రమలో ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షులు మల్యాల బాల్ నరసయ్య, ఎమ్మార్పీఎస్ నాయకులు పైసా రాజశేఖర్ మాదిగ, అల్వాల రాజు, మల్యాల అఖిల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నల్లగొని బాలకిషన్ గౌడ్ టిడిపి రాష్ట్ర నాయకులు అల్లాదుర్గం వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అల్వాల్ రమేష్, పెరిమల్ల యాదగిరి, అలువాల స్వామి,గంధమల్ల మల్లేష్,చింతల వెంకటయ్య, సుధాకర్ రెడ్డి, రాగిరి సత్తయ్య, ఈదులకంటి వెంకట్ రెడ్డి, బంగారు లక్ష్మయ్య, మార్క బిక్షపతి, ఎండి అజీమ్, ఎండి ఇసుఫ్,బావండ్లపల్లి అంజయ్య, గుడ్ల మనోహర్, అల్వాల అనిల్ కుమార్,కక్కెర్ల గణేష్, శ్రీనివాస్, కనకం విజయ్, మల్లేశం పంబాల, పెంటయ్య, బొట్టు గణేష్, సందెల నాగేష్, అందే శ్రీనివాస్, బొమ్మల నాగేశ్వరరావు, పురాణం శ్రీనివాస్, శివరాత్రి రాజు,అనిల్ తదితరులు పాల్గొన్నారు.