పయనించే సూర్యుడు న్యూస్ చండూరు ఏప్రిల్ 06. నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చండూరు మండలంలో స్వాతంత్ర్య సమరయోధులు, భారత తొలి దళిత ఉప ప్రధానమంత్రి, దళిత జాతి అభివృద్ధికై ఎంతో కృషి చేసిన మహనీయులు డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు మాదిగ సంఘాల నాయకుల ఐఖ్య వేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు..ఐఖ్య వేదిక నాయకులు కురుపాటి గణేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక మెయిన్ సెంటర్ లో బాబూ జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ నిరుపేద దళిత కుటుంబంలో జన్మించిన బాబూజీ ఎన్నో అవమానాలు ఎదురైనా దళిత జాతి అభివృద్ధి కోసం, సామాజిక సమానత్వం కోసం ఎంతో కృషి చేశారని, స్వతంత్ర భారతదేశంలో కేంద్ర మంత్రిగా, తొలి ఉప ప్రధానమంత్రిగా సేవలందించారని ఆయన సేవలను కొనియాడారు. జగ్జీవన్ రామ్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మాదిగలు ఏ పార్టీలో ఉన్నా, ఏ సంఘంలో పనిచేస్తున్నా జాతి ప్రయోజనాల కోసం సమిష్టిగా, ఐఖ్యతతో పనిచేయాలని ఆకాంక్షించారు..ఈ కార్యక్రమంలో నాయకులు కురుపాటి సుదర్శన్, ఇరిగి వెంకటేశం, అన్నెపర్తి యాదగిరి, ఇరిగి శంకర్, ఆడెపు పరమేష్, కురుపాటి శ్రవణ్, శాక నర్సింహా, రామ్మోహన్, బుచ్చాల ప్రవీణ్, తాడిశెట్టి సంతోష్, ఇక్బాల్, తదితరులు పాల్గొన్నారు.