పయనించే సూర్యుడు,కోరుట్ల ఏప్రిల్ 6 భారత మాజీ ఉప ప్రధాని ‘బాబుజీ’గా సుపరిచితులైన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు పురస్కరించుకుని కోరుట్ల పట్టణంలో ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కోరుట్ల మున్సిపల్ చైర్మన్ తిరుమల వసంత గంగాధర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.జగ్జీవన్ రామ్ విగ్రహానికి మున్సిపల్ చైర్మన్ తిరుమల వసంత గంగాధర్ పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో 4వ వార్డు కౌన్సిలర్ తెడ్డు శ్రీజ విజయ్ కుమార్ మరియు సీనియర్ కౌన్సిలర్ సోగ్రబి పాల్గొని బాబుజీ సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ.. దేశాభివృద్ధికి, ముఖ్యంగా అణగారిన వర్గాల అభ్యున్నతికి బాబు జగ్జీవన్ రామ్ చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. వారి ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.కౌన్సిలర్లు తెడ్డు శ్రీజ విజయ్ కుమార్ మరియు సోగ్రబి మాట్లాడుతూ.. సమాజంలో సమానత్వం కోసం బాబుజీ పడ్డ తపన స్ఫూర్తిదాయకమని, ఆయన చూపిన బాటలో నడవడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన గౌరవమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, పురప్రముఖులు వార్డు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.