పాలెం గ్రామపంచాయతీలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

పయనించే సూర్యుడు ఏప్రిల్ 6 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం పాలెం మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో ఈరోజు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బోనాసి రామకృష్ణ ఉపసర్పంచ్ గోవింద్ శ్రీనివాసులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ, “బాబుజి” అని ముద్దుగా పిలవబడే బాబు జగ్జీవన్ రామ్ గారి జీవితం, సేవలు సమాజానికి మార్గదర్శకమని, ఆయన సందేశాలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన చేసిన కృషి ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పుప్పాల శ్రీనివాస్ గౌడ్, వార్డు సభ్యులు గోవింద్, కాశన్న, వస్పరి శివ, నాగులు, లక్ష్మీనారాయణ, మైనోద్దీన్, నరసింహ, చంద్రశేఖర్, బోనాసి జ్యోతి, గ్రామపంచాయతీ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *