బాబు జగ్జీవన్ రావ్ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూల హారం

వేసి ఘన నివాళులు అర్పించిన ఆదోని నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ మాజీ శాసనసభ్యులు మీనాక్షి నాయుడు మరియు టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు.

పయనించే సూర్యుడు ఏప్రిల్ 6 కర్నూలు జిల్లా ఇన్చార్జ్ శ్రీకాంత్. ఆదోని పట్టణంలో ఆదోని నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్, మాజీ శాసనసభ్యులు మీనాక్షి నాయుడు , మరియు టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలహారం వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది.ఈ సందర్భంగా మీనాక్షి నాయుడు మాట్లాడుతూ ఈరోజు భారత దేశానికి గొప్ప సేవలు చేసిన మహానుభావుడు బాబు జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించడం మనందరికీ గర్వకారణం. సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు అపారమైనవి. ఆయన జీవితం మనకు స్ఫూర్తిదాయకం.బాబు జగ్జీవన్ రావు సమానత్వం, సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడారు. ఆయన చూపిన మార్గంలోనే మనమూ నడవాలి. సమాజంలోని ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు, అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతోపనిచేయాలి.తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంటుంది. పేదల, బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తుంది. ఈ సందర్భంగా ఆయన ఆశయాలను మన జీవితాల్లో ఆచరణలో పెట్టాలని మనందరం సంకల్పించాలి.బాబు జగ్జీవన్ రావు ఆశయాలు చిరస్థాయిగా నిలవాలనికోరుకుంటూ,ఆయనకు మరొక్కసారి ఘన నివాళులు అర్పిస్తున్నానుఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, క్లస్టర్, యూనిట్ సభ్యులు, బూత్ కన్వీనర్లు, పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *