పయనించే సూర్యుడు ఏప్రిల్ 6 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల కేంద్రంలో ఈరోజు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహనీయుల జయంతులు కేవలం వేడుకలకే పరిమితం కాకుండా, వారు చేసిన త్యాగాలు, సేవలను స్మరించుకుంటూ సమాజ అభివృద్ధికి ఆ దిశగా ముందుకు సాగాలని సూచించారు. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వంటి మహానుభావులు సమానత్వం, సామాజిక న్యాయం కోసం చేసిన కృషి ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు. అలాగే కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే బహుజన సంఘాల నాయకులు మహనీయుని గురించి అందరికీ అర్థమయ్యేలా చరిత్ర వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు, దేవరకొండ రామచందర్, మంగి విజయ్, మొలగర మహేందర్, నగిరి ఉషన్న, ఎమ్మార్పీఎస్ నాయకుడు కరిగల్ల దశరథం, ఎల్ వెంకటయ్య, మిద్దె ఇందిరా, రాము, వట్టెం చెన్నయ్య, మాసన్న. బీసీ సంఘం అధ్యక్షులు సత్యశీల, సాగర్, మాన్య నాయక్ పర్వతాలు, బాలపిరు మంగి విల్సన్ నాగేష్ బాలరాజు బాల్య నాయక్ పరశురాములు లేట్ల ఉదయ్ కుమార్ చంద్రన్న గౌడ్ మన్యం రామన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే బిజినపల్లి మండల దళిత బహుజన సంఘాల నాయకులు, ఎస్టి సంఘాల నాయకులు బీసీ సంఘాల ప్రతినిధులు మైనార్టీ నాయకులు అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీల నాయకులు భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.