బోధన్ పట్టణంలో ఘనంగా బాబు జగ్జీవన్ రావ్ 119వ జయంతి ఉత్సవాలు

* బాబు జగ్జీవన్ రావ్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న అధికారులు నాయకులు

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 6 బోధన్: బోధన్ పట్టణంలోని శక్కర్ నగర్ చౌరస్తాలో ఆదివారం భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు అధికారులు నాయకులు ప్రజాప్రతినిధులు పూలమాలు వేసి నివాళులర్పించారు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు ఈ కార్యక్రమంలో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో బోధన్ మున్సిపల్ చైర్ పర్సన్ తూము పద్మ శరత్ రెడ్డి బోధన్ మండల తహసిల్దార్ విట్టల్ బోధన్ ఏసీపి శ్రీనివాస్ సీఐ వెంకట్ నారాయణ అధికారులు నాయకులు ప్రజాప్రతినిధులు దళిత సోదరులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *