పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 6 యడ్లపాడు మండల ప్రతినిధి.. యడ్లపాడు మండల ప్రజలందరికీ ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు యడ్లపాడు మండల వైసీపీ పార్టీ అధ్యక్షుడు వడ్డేపల్లి నరసింహారావు.. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ, యేసు క్రీస్తు పునరుత్థానానికి ప్రతీకగా నిలిచే ఈ పవిత్ర పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆశ, ఆనందం, శాంతి నింపాలని ఆకాంక్షించారు. యేసు క్రీస్తు చూపించిన ప్రేమ, క్షమాగుణం, త్యా గం వంటి మహత్తరమైన విలువలు మన సమాజాన్ని సద్మార్గంలో నడిపించేందుకు ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. మనం పరస్పరం ప్రేమతో, సహనంతో, సౌహార్దంతో జీవిస్తే సమాజం మరింత శ్రేయోభిలాషిగా మారుతుందని అభిప్రాయపడ్డారు. ప్రత్యేకంగా ఈ పండుగ సందర్భంగా ప్రతి కుటుంబంలో సంతోషం, ఐక్యత నెలకొనాలని, బాధల్లో ఉన్నవారికి ధైర్యం, నిరాశలో ఉన్నవారికి ఆశ కలగాలని ఆయన కోరుకున్నారు. యువత మంచి విలువలను అలవర్చుకొని సమాజ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. అంతేకాకుండా, ఈస్టర్ పండుగను అందరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా, భక్తి భావంతో జరుపుకోవాలని యడ్లపాడు మండల ప్రజలకు వడ్డేపల్లి నరసింహారావు విజ్ఞప్తి చేశారు…