రాయపల్లి అభివృద్ధికి ఎంపీ డీకే అరుణ భారీ నిధులు

* 2.50 లక్షలతో ఐమాక్స్ లైట్ల మంజూరు * ఐమాక్స్ లైట్ల మంజూరుపై గ్రామస్తుల హర్షం * ప్రధాని మోడీ, ఎంపీ డీకే అరుణకు రాయపల్లి గ్రామస్తుల కృతజ్ఞతలు

పయనించే సూర్యుడు ఏప్రిల్ 06, మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ నరిగె కళాశేఖర్: మహబూబ్‌నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ రాయపల్లి గ్రామ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని బీజేపీ రాజాపూర్ మండల ఉపాధ్యక్షులు, గ్రామ డిప్యూటీ సర్పంచ్ పాలెం ప్రవీణ్ గౌడ్ తెలిపారు. ఎంపీ నిధుల నుండి రాయపల్లి గ్రామానికి రూ. 2.50 లక్షల వ్యయంతో ఐమాక్స్ లైట్లను మంజూరు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్ గౌడ్ మాట్లాడుతూ.. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ కి , నిధులు మంజూరు చేసిన ఎంపీ డీకే అరుణ కు రాయపల్లి గ్రామ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.గత కొద్ది రోజుల క్రితమే గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ. 12 లక్షలు మంజూరు చేయించిన ప్రవీణ్ గౌడ్, తాజాగా మరో రూ. 2.50 లక్షలతో ఐమాక్స్ లైట్లను తీసుకురావడం పట్ల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్న డిప్యూటీ సర్పంచ్ పాలెం ప్రవీణ్ గౌడ్ కు గ్రామస్తులు, స్థానిక ప్రజలు, యువకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *