రెండు రోజులు తెలంగాణలో వడగళ్ల వానలు!

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 06 మంథని నియోజకవర్గ ఇంచార్జి రమేష్,రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది,ఎండల ప్రభావం ఉన్నా. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. పగటి ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో 41 డిగ్రీల మార్క్ ను దాటే శాయి. శనివారం నల్గొండ జిల్లా మాడ్గులపల్లిలో అత్యధికంగా 41.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యా యి. 14 జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా రికార్డు అయింది. హైదరాబాద్‌లోనూ ఎండలు దంచికొడుతు న్నాయి. 38.5 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఎండలతోపాటు ఉక్కపోత కూడా ఎక్కువైంది. అయితే, ఇదే సమయంలో వర్షాలు కూడా పడుతా యని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తొలి రెండు రోజులు ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఆయి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆ తరువాత రెండు రోజు లకు దక్షిణ తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాలకు ఐఎండీ అలర్ట్ జారీ చేసింది. బలమైన ఈదురుగాలులు, 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. వడగండ్ల వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాలు పడే సమయంలో ఈదురుగాలులు వీచే సమయంలో సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.