పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 6 సాలూర : సాలుర మండల కేంద్రంలో మందర్న హున్సా ఖాజాపూర్ గ్రామాలలో శనివారం సాయంత్రం ఒక్కసారిగా వడగాళ్ల వానతో రైతులను ఉక్కిరిబిక్కిరిగా చేసింది అసలే రైతన్న వర్షాకాలం సీజన్లో వరద బీభత్సంతో నష్టపోగా ఇప్పుడు రైతన్న వడగళ్ల వానతో ఇలా నష్టపోవడం జరిగింది ప్రభుత్వం రైతన్న దేశానికి వెన్నెముక లాంటిదని మాటల్లోనేనా మరి చేతుల్లో కాదా సూరజ్ రైతన్న మాట్లాడుతున్న మాటలు ముందల బాయి ఎనకాల గొయ్యి ఓక తాడు ఒక చెట్టు ఇక మాకు అదే దిక్కు అంటున్న రైతన్న కన్నీరు మున్నీరవుతున్నాడు కనీసం ప్రభుత్వం చెప్పడానికి తప్ప రైతన్న విషయంలో ఇప్పటివరకు ఎలాంటి సహాయం కూడా చేయలేని పరిస్థితిలో ఉందని ఆ రైతన్న కన్నీటి కాదా మరో రైతన్నలకు కన్నీరు తెప్పించింది ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఆ రైతన్నల గోడు పట్టించుకోవాలని ఆయా గ్రామ రైతులు కోరుతున్నారు