పయనించే సూర్యుడు, ఏప్రిల్ 06 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఎస్ఎం కుమార్ బాబూ జగ్జీవన్ రామ్ గారు కేవలం ఒక రాజకీయ నాయకుడు కాదు,ఆయన ఒక ప్రేరణగా,కష్టాలను ఎదుర్కొని కూడా సమాజ సేవ కోసం నిలబడితే చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తామని వారి జీవితం మనకు చెబుతుందని అన్నారు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ స్వాతంత్ర సమరయోధులు,సంఘసంస్కర్త,దళిత హక్కుల పరిరక్షకుడు మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఈరోజు నల్లగండ్ల డివిజన్ పరిధిలోని గోపనపల్లి నందు శేరిలింగంప ల్లి నియోజకవర్గం నాయకుల తో కలిసి ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ: ఈ రోజు మనం గుర్తు చేసుకుంటున్న మహానాయకుడు, సామాజిక న్యాయం కోసం జీవితాన్ని అర్పించిన మహామనిషి బాబు జగ్జీవన్ రామ్ అని,ఆయన జీవితం ఒక సాధారణ నాయకుడి కథ కాదు… అది ఒక ఉద్యమం… ఒక పోరాటం… ఒక స్పూర్తి! బాబూజీ కేవలం స్వాతంత్ర్య సమరయోధుడే కాదు,అణగారిన వర్గాల గుండెల్లో వెలిగిన దీపం..! కుల వివక్ష అనే చీకటిలో,సమానత్వం అనే వెలుగును వెలిగించిన మహానుభావుడు అని గుర్తుచేసారు.. పదవులు అందరికీ వస్తాయి కానీ ప్రజల మనసుల్లో స్థానం సంపాదించడం కొద్ది మందికే సాధ్యం..! అలాంటి అరుదైన నాయకుడు బాబూ జగ్జీవన్ రామ్అ ని, దేశం కోసం,సమాజం కోసం,ప్రజల హక్కుల కోసం ఆయన చేసిన త్యాగాలు ఈరోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛకు బలమైన పునాది అని అన్నారు.. ఈ కార్యక్రమంలో నాయకులు పల్లపు సురేందర్, మల్లికార్జున్ యాదవ్, రాజు నాయక్, వెంకటేష్నాయక్, హనుమంతు, శివ గౌడ్, యాదగిరి, బాలకృష్ణ, విజేందర్ రెడ్డి, జగదీష్, భరత్, రమేష్ యాదవ్, భా స్కర్చారి, జయసాయి, సతీష్, తిరుమల, రాజు, శ్రీను, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.