
పయనించే సూర్యుడు ఏప్రిల్ 06, (చింతకాని మండలం రిపోర్టర్.వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని మండల కేంద్రంలో ఆదివారం ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని క్రైస్తవులు భారీ ర్యాలీ నిర్వహించారు. క్రైస్ట్ చర్చి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో క్రీస్తు పునరుద్ధాన సువార్తను ప్రజలకు విస్తృతంగా ప్రచారం చేశారు.తెల్లవారుజామున ప్రారంభమైన ర్యాలీలో విశ్వాసులు గ్రామంలోని వీధులన్నింటిలో తిరుగుతూ యేసు క్రీస్తు మరణించి మూడవ రోజున తిరిగి లేచిన సందేశాన్ని గీతాల ద్వారా తెలియజేశారు. యేసు క్రీస్తు మనుషుల పాపాల విమోచన కోసం కల్వరి సిలువపై ప్రాణత్యాగం చేసి, తిరిగి లేచి మరణంపై విజయం సాధించారని వివరించారు.ఈస్టర్ పండుగ ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పునరుత్థాన దినోత్సవమని, మానవులకూ శాశ్వత జీవితం మీద విశ్వాసాన్ని కలిగించే సందేశమని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు ప్రజలకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాస్టర్లు వేముల ఆకాష్, జంగాల ప్రకాష్ బాబు, విజయరత్నం, విజయ్ కుమార్, సుందర్ కాంత్, రాజేష్, దావీద్, రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. అలాగే చర్చి పెద్దలు వేముల శ్రీనివాసరావు, తలారి లక్ష్మీనారాయణ, వెర్పుల అనిల్ కుమార్, గుండెపోగు నరేష్, గంటెల కిరణ్, వేముల కిషోర్, తలారి గోపి తదితరులు, వివిధ సంఘాల సభ్యులు, విశ్వాసులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.