పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 6 అశ్వారావుపేట మండల రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏసుక్రీస్తు మూడవ దినమున మరణం గెలిచి లేచారని దీనిని ఈస్టర్ పండగగా జరుపుకుంటారని ఫాస్టర్ సున్నం సియోనుకుమార్ అన్నారు. ఈ సందర్భంగా దిబ్బగూడెం అల్లిగూడెం రామన్నగూడెం నాగుల గుంపు చర్చిలలో ఆదివారం ఆయన మాట్లాడుతూ ఏసుక్రీస్తు మానవాళి పాల విమోచన కొరకు తన సిలువపై తన పరిశుద్ధయ రక్తం కార్చి చనిపోయిన తాను ముందుగా చెప్పినట్లు మరణం గెలిచి లేచాడని క్రైస్తవులు ఈస్టర్ పండుగ జరుపు కుంటున్నారు. అలాగే ఏసుక్రీస్తు మరణం గెలిచి తిరిగి లేవడం ఆయన పరిశుద్ధుడు అని ఆయన ద్వారా మాత్రమే మానవాళికి పాప విమోచన దొరుకుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో చర్చి పాస్టర్ సియోను కుమార్ రాందాస్ జైపాల్, ప్రసాద్ దేవేంద్ర ప్రభుదాస్, కిషోర్ సుధాకర్ రమేష్ ఏసుసేపు మలాకి డేవిడ్ రాజు కుమారి క్రైస్తవ సోదరులు సంఘస్తులు తదితరులు పాల్గొన్నారు.