అంగరంగ వైభవంగా నారాయణ పాఠశాల మొదటి వార్షికోత్సవం

పయనించేసూర్యుడు న్యూస్ ఏప్రిల్ 7ఆదోనిడివిజన్ ఇంచార్జ్ గుమ్మల బాలస్వామి శీర్షిక ఏ.జి.మ్ రమేష్ కుమార్ క్లస్టర్ ప్రిన్సిపాల్ అన్వర్ బాషా ఆధ్వర్యంలో ఘనంగా మొదటి పాఠశాల వార్షికోత్సవం ఆదోని నారాయణ పాఠశాల వారి మొదటి వార్షికోస్తవం మున్సిపల్ మైదానంలో అంగరంగా వైభావముగా నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆదోని డిప్యూటీ డిఇ ఓ రాజేంద్రప్రసాద్ మరియు మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ నాజిర్, ఆదోని టిడిపి యూత్ లీడర్ మారుతి నాయుడు,టూ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి అతిథులుగా క్లస్టర్ ప్రిన్సిపల్ ఎం అన్వర్ భాష మరియు స్పోర్ట్స్ ఆర్ అండ్ డి అరుణ్ పవన్ హై స్కూల్ జెడ్ సి శ్రీ హరి రెడ్డి ఈఛాంప్స్ ప్రియాంక & ఈ జెడ్ సి జైబా ఏజిమ్ అనలసిస్ట్ పవన్, సాఫ్ట్ స్కిల్స్ ఆర్ ఎస్ టి ప్రకాష్, ఐటీ టీం లీడర్ శివ ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి ఆదోని నారాయణ ప్రిన్సిపల్ శ్రీ లక్ష్మీ రెడ్డి మాట్లాడుతూ ఈరోజు మన నారాయణ పాఠశాల మొదటి వార్షికోత్సవ వేడుకలను జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది ఈ ప్రత్యేకమైన రోజున మనందరం ఇక్కడ కలుసుకోవడం ఎంతో సంతోషకరం గడిచిన విద్యా సంవత్సరం మనకు ఎన్నో విజయాలను, జ్ఞాపకాలను అందించింది చదువులోనే కాకుండా ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా మన విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు మన పాఠశాల కేవలం పుస్తక జ్ఞానమే కాకుండా, క్రమశిక్షణ, నైతిక విలువలు, మరియు సామాజిక బాధ్యతను కూడా బోధిస్తుంది మనమందరం ఈ ఎత్తుకు ఎదగడానికి, నిరంతరం శ్రమిస్తున్న ఉపాధ్యాయులకు, మరియు మనకు మద్దతుగా నిలుస్తున్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు అన్వర్ బాషా మాట్లాడుతూ ఈ రోజు మన విద్యార్థులు ప్రదర్శించబోయే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, వారి సృజనాత్మకతకు అద్దంపడతాయి ఈ రోజును చిరస్మరణీయంగా మార్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు
డిప్యూటీ డి ఇ ఓ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ మీ పాఠశాల వార్షికోత్సవానికి హాజరవ్వడం నాకు దక్కిన గౌరవం ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడి ఉత్సాహభరితమైన, చైతన్యవంతమైన విద్యా వాతావరణానికి నిదర్శనం మారుతీ నాయుడు మాట్లాడుతూ పాఠశాల సంపూర్ణ వికాసానికి కట్టుబడి ఉండటాన్ని ప్రతిబింబించే ఉత్సాహభరితమైన ప్రదర్శనలను, అద్భుతమైన ప్రతిభను నేను ప్రత్యక్షంగా చూశాను విద్యార్థులందరికీ, గుర్తుంచుకోండి, అంకితభావం మరియు పట్టుదలతోనే విజయం లభిస్తుందిపాఠశాలలో మీ సమయాన్ని ఆస్వాదించండి మరియు అభివృద్ధి చెందడానికి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోండి. నేటి ప్రదర్శనలో తమ అంకితభావం స్పష్టంగా కనబడుతున్న ఉపాధ్యాయులకు మరియు సిబ్బందికి నా హృదయపూర్వక అభినందనలు టూటౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ వార్షికోత్సవ వేడుక పాఠశాల సమాజంలో గర్వం మరియు ఐక్యతా భావాన్ని పెంపొందిస్తుంది, ఎందుకంటే ఇది ఆ సంవత్సరపు విజయాలను మరియు విద్య యొక్క సానుకూల ప్రభావాన్ని సమీక్షించుకోవడానికి అందరినీ ఒకచోట చేర్చుతుంది ఇది విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల మధ్య బంధాన్ని బలపరుస్తూ, వారి కృషికి మరియు సృజనాత్మకతకు గుర్తింపు పొంది రాణించడానికి ఒక అవకాశాన్ని కూడా అందిస్తుంది కార్యక్రమం అనంతరం మారుతీ నాయుడు పుట్టినరోజు వేడుకను జరుపుకున్నారు ఈ కార్యక్రమములో విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొనడం జరిగినది.