
పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ తేదీ 7 రూలర్ రిపోర్టర్ ప్రతినిధి బాసు అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయ మండలకేంద్రం లొ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. బిజెపి కార్యకర్తలు పాల్గొని బిజెపి జెండా ఆవిష్కరణ చేసి ఉత్సాహం తో స్వీట్స్, చాకోలెట్స్ పంచుకున్నారు. ఈ సందర్బంగా జిల్లా బిజెపి కార్యదర్శి రామచంద్ర మరియు దేవాదాసు లు మాట్లాడుతూ పార్టీ స్థాపించి 46సంవత్సరాలనుండి దేశం, దేశ ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తూ ప్రపంచం లోనే అతి పెద్ద పార్టీ గ బిజెపి అవతరించ్చిందని అన్నారు. నవనిర్మాణ భారత్ గ మోడీ ఆధ్వర్యంలో ప్రపంచ దేశాలు మన దేశం వైపు చూసే విదంగా అభివృద్ధి చెందుతుందన్నారు. బిజెపి ప్రభుత్వం గిరిజనులకు దేశ అత్యున్నత పదవితో పాటు గిరిజన ప్రాంత అభివృద్ధి కి ఎంతో కృషి చేస్తుందన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి డోంబు నాయుడు, సోషల్ మీడియా కన్వినర్ బలరాం, మండల అధ్యక్షులు మురళి, సీనియర్ నాయకులు మూర్తి, రమేష్, బలరాం, జైరాం కార్యకర్తలు తదితరులుపాల్గొన్నారు.