అశ్వారావుపేట తహశీల్దార్ కిషోర్ బాధ్యతల స్వీకరణ

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 7 అశ్వారావుపేట మండలం రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల నూతన తహశీల్దార్ డి. కిషోర్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల ప్రజలకు రెవెన్యూ సేవలను వేగవంతంగా, పారదర్శకంగా అందిస్తానని స్పష్టం చేశారు. భూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన కిషోర్కు రెవెన్యూ సిబ్బంది, స్థానిక నాయకులు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.