ఆలేరు విద్యార్థి రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌కు ఎంపిక.

జిల్లా స్థాయిలో విజయం… రాష్ట్ర స్థాయికి అడుగులు.

పయనించే సూర్యుడు. ఏప్రిల్ 7.నాగర్ కర్నూల్ జిల్లా. తెల్కపల్లి మండలం రిపోర్టర్ :సుల్తాన్ నాగర్ కర్నూల్ జిల్లా. తెల్కపల్లి మండలం.ఆలేరు పాఠశాల విద్యార్థి రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక.నాగర్ కర్నూలు జిల్లాలో ఈ నెల శుక్రవారం రోజు అచ్చంపేట పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర కళాశాలలో జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ సెలెక్షన్ లో తెలకపల్లి మండలంలోని ఆలేరు ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి డి.రామ్ చరణ్,అండర్ 20 సంవత్సరాల బాలుర విభాగంలో 3,000 మీటర్ల లో ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం జరిగింది . ఏప్రిల్ 11,12 తేదీన హనుమకొండ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో పాల్గొననున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ జి. నరహరి మరియు ఫిజికల్ డైరెక్టర్ శ్రీ ఎ.బాలయ్య తెలిపారు. వీరి ఎంపిక పట్ల పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థినీ విద్యార్థుల,తల్లిదండ్రులు, మరియు ఆలేరు సర్పంచ్ శ్రీ తగిలి ఆనంద్ , అమ్మ ఆదర్శ పాఠశాల వైస్ చైర్ పర్సన్ శ్రీమతి అమృతమ్మ గ్రామ పెద్దలు విద్యార్థిని అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *