ఆసుపత్రి శానిటేషన్ సిబ్బందికి, వృద్ధులకు భోజనం పొట్లాలు అందజేత

పయనించే సూర్యుడు న్యూస్, ఏప్రిల్ 07 (ఏలేశ్వరం మండల రిపోర్టర్ ఏ శివాజీ) : పట్టణoలో వివేకానంద సేవా సమితి సభ్యుడు,సంగం డైరీ మండల డిస్ట్రిబ్యూటర్ అబ్దుల్ కరీం(సరూక్) పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో శానిటేషన్ సిబ్బందికి, పట్టణంలో కొంతమంది వృద్ధులకు భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ఆస్పత్రి సూపర్డెంట్ డాక్టర్ రమేష్, వైద్యురాలు లావణ్య ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా వైద్యులు, వివేకానంద సేవా సమితి సభ్యులు మీడియాతో మాట్లాడుతూ వివేకానంద సేవా సమితి సభ్యులు అబ్దుల్ కరీం పుట్టినరోజు సందర్భంగా ఆస్పత్రిలో శానిటేషన్ సిబ్బందికి భోజనాన్ని పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని,వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మైరాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో గత 15 రోజులుగా ఆస్పత్రి ఆవరణలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వివేకానంద సేవాసమితి సభ్యులు పెండ్యాల రాజు, సేనాధిపతి రాజబాబు,సునీల్, ఆసుపత్రి సిబ్బంది చక్రవర్తి ,ప్రమీల, యూత్ సభ్యులు ఆకుల శంకర్, పఠాన్ బషీర్,పుల్ల దుర్గాప్రసాద్,జెడ్డా సులేమాన్ తదితరులు పాల్గొన్నారు.