పయనించే సూర్యుడు ఏప్రిల్ 07, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని మండల పరిధిలోని జగన్నాధపురం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగంగా లబ్ధిదారుల ఇళ్ల పనులు వేగంగా కొనసాగుతున్నాయి.ఇందులో భాగంగా రూంజ కళావతి ఇంటి స్లాబ్ పనులకు గ్రామ సర్పంచ్ తాళ్ళూరి స్వప్న కొబ్బరికాయ కొట్టి ఘనంగా శ్రీకారం చుట్టారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్, ప్రణాళిక శాఖ మంత్రివర్యులు మల్లు భట్టి విక్రమార్క కృషితో గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని ఈ సందర్భంగా సర్పంచ్ తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఇళ్ల పథకం పేదలకు ఎంతో ఉపయోగపడుతోందని, త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆమె సూచించారు.ఈ కార్యక్రమంలో మత్కేపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ బందెల నాగార్జున, మొదటి వార్డు సభ్యులు తోటకూరి హరీష్, కాంగ్రెస్ నాయకులు తాళ్ళూరి రమేష్, సింగ్ కిషోర్, మధిర నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ అనిల్ కుమార్ వేర్పుల, గ్రామ కార్యదర్శి చామర్తి కృష్ణమాచారి, నాలుగో వార్డు సభ్యులు కొత్తపెళ్లి నరసమ్మ, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు అరువురి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు యరమల ప్రసాద్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మెట్టల కృష్ణతో పాటు గ్రామ ప్రజలు, నాయకులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.