ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు – లబ్ధిదారులకు బట్టల పంపిణీ చేసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

* మూడు గ్రామాల్లో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన * వీర్లపల్లి శంకర్ తోనే అభివృద్ధి సాధ్యం: సర్పంచ్ చందునాయక్

పయనించే సూర్యుడు ఏప్రిల్ 07 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, రాజకీయాలకు అతీతంగా అందరం కలిసిమెలిసి గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పిలుపునిచ్చారు. సోమవారం ఆయన మండల పరిధిలోని భీమారం, ఉప్పరిగడ్డ, చించొడ్ గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా సుమారు కోట్లాది రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పలు కీలక పనులను ప్రారంభించారు. భీమారం, ఉప్పరిగడ్డ, గ్రామాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. అదేవిధంగా చించొడ్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. అంతకుముందు చించొడ్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా అదనపు గదుల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాణ్యతతో కూడిన పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సొంతింటి లబ్ధిదారుల ఇంట సంబరాలు భీమారం, చించోడు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్ధిదారులు ఈరోజు సామూహిక గృహప్రవేశాలు నిర్వహించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన, వారికి నూతన వస్త్రాలను బహూకరించి శుభాకాంక్షలు తెలిపారు. పేదవాడి సొంతింటి కల నెరవేరుతుంటే చూడటం ఎంతో సంతోషంగా ఉందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఉప్పరిగడ్డలో జనసంద్రం – సర్పంచ్ ప్రశంసలు ఉప్పరిగడ్డ గ్రామంలో సర్పంచ్ చందునాయక్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభకు అయ్యవారిపల్లి, మక్త, జయరాం తండా గ్రామాల నుండి ప్రజలు, మహిళలు, యువకులు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సర్పంచ్ చందునాయక్ మాట్లాడుతూ.. “వీర్లపల్లి శంకర్ అన్న నాయకత్వంలో నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనలో ఆయన చూపిస్తున్న చొరవ అభినందనీయమన్నారు. ఆయనతోనే మన గ్రామాల అభివృద్ధి సాధ్యం” అని స్పష్టం చేశారు. ముఖ్యంగా తమ గ్రామానికి ఎమ్మెల్యే 30 లక్షల సిసి రోడ్లు నిర్మాణాల పనులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణానికి మరో 20 లక్షల రూపాయల నిధులు కేటాయించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా గ్రామంలో 18 ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తున్నామని, మరో 20 ఇల్లు మంజూరు చేయడానికి ఎమ్మెల్యే హామీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని, తద్వారా పేద ప్రజల ఆకాంక్ష నెరవేరుతుందన్నారు. ఇలాంటి ఎమ్మెల్యే మన నియోజకవర్గానికి ఉండడం అభినందనీయమన్నారు.ఈ పర్యటనలో ఫరక్ నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, అయ్యవారిపల్లి గోపాల్ నాయక్, చించోడు సర్పంచ్ శ్రీనివాస్, చౌలపల్లి సర్పంచ్ జంగయ్య, ఉప్పరిగడ్డ డిప్యూటీ సర్పంచ్ శ్రీలత తిరుపతయ్య, కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ మండల వైస్ ప్రెసిడెంట్ గజేంద్ర నాయక్, బి తిరుపతయ్య, భోజ్య నాయక్, ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు, పార్టీ సీనియర్ నాయకులు, యువజన విభాగం ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *