ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపిన తల్లాడ మాజీ ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు..

పయనించే సూర్యుడు న్యూస్ :ఏప్రిల్ 7 ,తల్లాడ రిపోర్టర్ యేసుక్రీస్తు పునరుద్దాన పండుగ సందర్భంగా తల్లాడ మండల ప్రజలకు తల్లాడ మాజీ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు ఈస్టర్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున ఎస్సీ కాలనీలో చర్చిలో ఆయన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఆయనతోపాటు అన్నారుగూడెం గ్రామ సర్పంచ్ గొడ్ల ప్రభాకర్ హాజరై ప్రార్థనలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయనను శాలువాలతో సన్మానించి సత్కరించారు. తొలుత కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ గొల్లమందల చలపతిరావు, గ్రామ పెద్దలు ఇసనపల్లి శ్రీనివాసరావు, బొల్లెపోగు కృష్ణ, ప్రవీణ్. మోషే, రమేష్, చిన్నారులు పాల్గొన్నారు.