ఉచిత లేబర్ కార్డుల పంపిణీ

★ సొంత ఖర్చులతో పంపిణీ చేసిన చిలువేరు స్వామి

పయనించే సూర్యుడు న్యూస్ పెద్దపల్లి-07 భవన నిర్మాణ కార్మిక సమైక్య సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు చిలువేరు స్వామి తమ సొంత ఖర్చులతో నిరుపేద కార్మికులకు లేబర్ ఇన్సూరెన్స్ కార్డులు సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ… భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు ప్రతి ఒక్కరు లేబర్ ఇన్సూరెన్స్ కార్డు తీసుకోవాలని కార్డు ద్వారా వర్తించే సంక్షేమ పథకాలు వినియోగించుకోవాలన్నారు.వెల్ఫేర్ బోర్డులో నమోదైన కార్మిక కుటుంబాలకు వర్తించే పెళ్లి కానుక 30 వేలు, డెలివరీ ఖర్చులు 30 వేలు, లేబర్ కార్డు లేక కోల్పోతున్నారన్నారు. నా వంతు సహాయంగా నిరుపేద కార్మికులకు లేబర్ ఇన్సూరెన్స్ కార్డులు ఉచితంగా పంపిణీ చేస్తున్న అన్నారు.