పయనించే సూర్యుడు-07-04-2026-రాజంపేట న్యూస్ : కార్మికుల హక్కుల రక్షణకు ఉదృత పోరాటాలు చేయడానికి ఈ నెల 26 నుండి 28 వ తేదీ వరకు తిరుపతిలో జరగనున్న ఏఐటియుసి రాష్ట్రపతి రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని, ఈ మహాసభల్లో కార్యాచరణ రూపొందించబోతున్నట్లు మరియు పలు కీలకమైన అంశాలపైన చర్చలు జరిపి పలు తీర్మాణాలు చేయనున్నట్లు ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు జి.వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ కే.బాదుల్లా వెల్లడించారు. 26వ తేదీన తిరుపతి పట్టణంలో జరుగు కార్మిక ప్రదర్శన, బహిరంగ సభలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున తరలివచ్చి పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. సోమవారం ఏఐటీయూసీ కార్యాలయం యందు ఏఐటియుసి ఏరియా, అనుబంధ సంఘాల సమావేశం ఏరియా కార్యదర్శి ఈ.సికిందర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన జి.వేణుగోపాల్, కే.బాదుల్లా మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక, ఉద్యోగుల హక్కులను కాలరాస్తున్నాయని, పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను మోడీ, చంద్రబాబు హరించివేస్తూ బానిసలుగా మారుస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. సమ్మె చేసే హక్కులేదని పోరాడి సాధించుకున్న 8 గంటల పనిని పెంచారని, లేబర్ కోడ్ లను తీసుకోచ్చి కార్మికుల, ఉద్యోగుల నడ్డి విరుస్తున్నారన్నారు. తిరుపతిలో జరుగ బోయే మహాసభలు ప్రభుత్వాలు ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలు చేయాలంటే భయపడేలా జరుపాలని పిలుపునిచ్చారు. కేంద్రం తెచ్చిన లేబర్ కోడ్ లను కేరళలో ఎల్ డి ఎఫ్ ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. కేరళలో ప్రతి కార్మిక రంగానికి ఒక కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారని ప్రతి ఒక్కరికి వెల్ఫేర్ బోర్డులు ఉన్నాయని తెలిపారు.కార్మిక రాజ్యం ఉన్న చోట కార్మిక హక్కులు రక్షించబడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. రాష్టంలో దేశంలో నిరుద్యోగం పెరిగిపోతుందని కార్మికులను, కష్ట జీవులతో కారు చౌకగా పని చేయిస్తూ పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు కార్మికుల శ్రమను దోచుకుంటున్నారన్నారని విమర్శించారు. దేశంలో సంపద సృష్టించే కార్మిక వర్గంపై పాలక వర్గాలు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సిపిఐ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి పి.మహేష్, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు గాలి చంద్ర, భవన నిర్మాణం నాయకులు, నరసింహులు, శివయ్య, మహమ్మద్ హుస్సేన్, పరమయ్యగారి సుబ్రహ్మణ్యం, ఆటో వర్కర్స్ యూనియన్, రమణ,దస్తగిరి, సాయి, శివ, విజయ్, సాయి కిరణ్, మున్నా, బూస్ లి, ఆర్టీసీ అవుట్సోర్సింగ్ కుమార్ ఆశ వర్కర్స్ యూనియన్ రెడ్డమ్మ, పెద్ద రెడ్డమ్మ, లగేజీ ఆటో, కోవెట్ల తదితరులు పాల్గొన్నారు.