ఎమ్మెల్యే పాయం కి అశ్వాపురం పంచాయతీ లోని సమస్యలపై మెమొరాండం

మండల కేంద్రంలో బస్ స్టాండ్ ఏర్పాటు మరియు స్మశాన వాటిక కి దారి గురించి వినతి పత్రం సమర్పించిన సర్పంచ్ సదర్ లాల్.

పయనించే సూర్యుడు, ఏప్రిల్ 76, అశ్వాపురం: సోమవారం నాడు అశ్వాపురం గ్రామపంచాయతీలో నిర్వహించిన ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన శాసనసభ సభ్యులు పాయం వెంకటేశ్వర్లు ని, అశ్వాపురం సర్పంచ్ బానోత్ సదర్ లాల్ మరియు ఉప సర్పంచ్ తుళ్లూరి ప్రకాష్ రావు లు మర్యాదపూర్వకంగా కలిసి, గ్రామంలో ఉన్న ముఖ్యమైన సమస్యలపై మెమోరాండం సమర్పించారు. అశ్వాపురం గ్రామంలో స్మశాన వాటికకు సరైన దారి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని ప్రస్తుతం ఎస్సీ కాలనీ సాయిబాబా గుడి నుంచి, పూనేం కోటయ్య పంట పొలం మీదుగా స్మశాన వాటికకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది అని, అయితే ఆయన తన స్థలం ద్వారా దారి ఇవ్వడానికి నిరాకరిస్తున్నాన్దున. ఈ విషయంపై మాజీ సర్పంచ్ పూనేం కోటయ్య తో మాట్లాడి, స్మశాన వాటిక దారికి సుమారు 120 గజాల స్థలాన్ని కేటాయించగలిగితే, గ్రామపంచాయతీ నిధులతో రోడ్డు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అశ్వాపురం అనేది మండల కేంద్రమైనప్పటికి బస్టాండ్ మరియు బస్సు షెల్టర్ సౌకర్యాలు లేకపోవడం వలన మండల కేంద్రంలో ఉన్న వైద్యశాల, పాఠశాలలు, మార్కెట్ తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని. తెలుపగా తక్షణమే స్పందించి ఈ సమస్యను పరిష్కరించడానికి శాసనసభ్యులు ఆర్ అండ్ బి ఆఫీస్ వద్ద ఉన్న స్థలాన్ని కేటాయిస్తానని మరియు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖవర్యులు పొన్నం ప్రభాకర్ రావు తో, ఆర్ అండ్ బి అధికారులతో మాట్లాడి బస్టాండ్ ఏర్పాటు చేయడానికి హామీ ఇచ్చారు. అనంతరం అశ్వాపురం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న రైతు వేదిక లో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను పాయం వెంకటేశ్వర్లు చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆర్థికంగా బలహీన వర్గాల కుటుంబాల పెళ్లిళ్లకు సహాయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తున్నాయని తెలిపారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి పారదర్శకంగా ఈ పథకాలను అందించడం జరుగుతోందని చెప్పారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల గురించి వివరించి, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల అభ్యున్నతి కోసం తీసుకుంటున్న చర్యలను కూడా వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.