పయనించే సూర్యుడు న్యూస్: కడప ఏప్రిల్:7 కడప కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఏఐబిఎస్ యు ఆధ్వర్యంలో ఆందోళన కోట్ల రూ.లు విద్యాశాఖ అధికారుల మధ్య చేతులు మారాయి విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఏఐబిఎస్ యు రాష్ట్ర అధ్యక్షులు రామావత్ జగన్ నాయక్ డిమాండ్ ఓపెన్ స్కూల్, ఇంటర్ పరీక్షలల్లో కాపీలు జరిపేందుకు ఒక్కో విద్యార్థి నుండి 5 వేల రూ. ల తో, కోట్ల రూపాయలు అవినీతి వ్యవహారం పై ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్ సాంబ శివ రెడ్డి , మిగతా వారిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఏఐ బి ఎస్ యు రాష్ట్ర అధ్యక్షులు జగన్ నాయక్ డిమాండ్ చేశారు సోమవారం కడప కలెక్టరేట్ వద్ద ఏఐ బి ఎస్ యు ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ఓపెన్ స్కూల్, ఇంటర్ విద్యార్థుల పరీక్షల సమయం లో కాపీ లు జరిపించేందుకు ఒక్కో విద్యార్థి నుండి 5 వేల రూపాయలు వసూలు చేశారు. దీనికి జిల్లాలోని అక్కడి సెంటర్స్ నిర్వాహకులు కీలక పాత్ర పోషించారు. వారి ద్వారా కో ఆర్డినేటర్ వసూలు చేసుకున్నందన్నారు. దీనికి పరీక్షలు రాసిన విద్యార్థుల్ ప్రత్యేక్ష సాక్షులు అన్నారు. ఇలా వసూలు చేసిన కోట్ల రూపాయలు, విద్యాశాఖ అధికారులు పంచుకున్నరన్నారు. కో ఆర్డినేటర్ పోస్టులో అవినీతికి ఆస్కారం ఎక్కువని కో ఆర్డినేటర్ గా వున్నా సాంబ శివారెడ్డి, అర్హతలు లేకున్నా పైరవీలు చేసుకొని కో ఆర్డినేటర్ గా వచ్చాడాన్నారు. ఆయన అర్హతల పైన కూడా విచారణ చేయాలనీ, మొత్తం గా కోట్ల రూపాయలు చేతులు మారిన వ్యవహారం పై విచారణ జరిపించి విచారణ చేయాలని, అందుకు జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపాలని కోరారు.ఈ కార్యక్రమంలో రమేష్ నాయక్, జయరాజు, నిఖిల్, అభిలాష్, నాగిరెడ్డి, మల్లేష్, రామూర్తి, మనోజ్, తదితరులు పాల్గొన్నారు