కటుకూరి కుమారిని పరామర్శించిన అన్నారుగూడెం నాయకులు..

పయనించే సూర్యుడు న్యూస్ :ఏప్రిల్ 7 ,తల్లాడ రిపోర్టర్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన అన్నారుగూడెం 14వ వార్డు మెంబరు కటుకూరి కుమారిని అన్నారుగూడెం గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు పరామర్శించారు. సోమవారం ఖమ్మంలోని ప్రసూన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను వారు పరామర్శించారు.ఈ సందర్భంగా ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పరామర్శించిన వారిలో తల్లాడ మాజీ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు, గ్రామ సర్పంచ్ గొడ్ల ప్రభాకర్, ఉపసర్పంచ్ కొమ్మినేని వెంకటేశ్వర్లు కెవి, నాయకులు పొన్నం కృష్ణయ్య, దొడ్డ చిన్న శ్రీనివాసరావు, మారేళ్ల దేవేందర్, తుమ్మలపల్లి వెంకటయ్య, రామానుజవరం నాయకులు శీలం కోటారెడ్డి తదితరులు ఉన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *