కార్యకర్తే బీజేపీ బలం:- బిజేవైఎం మండల అధ్యక్షులు బెస్త నాగరాజు.

పయనించే సూర్యుడు ఏప్రిల్ 7 ఆదోని రూరల్ రిపోర్టర్ భారతీయ జనతా పార్టీ కి కార్యకర్తలే బలమని బీజేపీ యువజన విభాగం మండల అధ్యక్షులు బెస్త నాగరాజు అన్నారు.సోమవారం ఆదోని- 2 మండల పరిధి లోని చిన్నహరివనం గ్రామంలో బీజేపీ కేంద్ర, రాష్ట్ర, జిల్లా & ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి ఆదేశాల మేరకు బీజేపీ సీనియర్ నాయకులు ప్రతాప్ రెడ్డి ఆద్వర్యంలో బీజేపీ జెండా ఆవిష్కరణ ( మన ఊరు – మన జెండా) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేవైఎం మండల అధ్యక్షులు బెస్త నాగరాజు, ప్రతాప్ రెడ్డి లు మాట్లాడుతూ ఎందరో కార్యకర్తల, నాయకుల, బలిదానాల పునాదులపై నిర్మితమై.. ఏకాత్మ మానవతా వాదం, అంత్యోదయ ఆలంబనగా..క్రమశిక్షణ అకుంఠిత దీక్ష, అంకిత భావానికి ప్రతి రూపమై..దేశాభివృద్ధి యజ్ఞం లో నిరంగరాయణగా నిమగ్నమై .. ప్రపంచం లో అతిపెద్ద పార్టీ గా అవతరించిన భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవము జరుపుకోవడం గురించి మాట్లాడారు.ప్రజా సమస్యల పరిష్కారమే దిశగా బీజేపీ పనిచేస్తుందని తెలియజేశారు. ఈ కారక్రమం లో బీజేపీ నాయకులు శ్రీరాములు, లక్ష్మన్న, వీరేశప్ప, కిష్టప్ప తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *