కోణం పంచాయతీ కి రీ సర్వే ప్రారంభం చేయాలి గిరిజన సంఘం డిమాండ్

పయనించే సూర్యుడు రిపోర్టర్ : శ్రవణ్ రాజ్ 7.4.2026 అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం కోణం పంచాయతీలో 16 గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలందరూ వాళ్ళ తాత తండ్రి నుండి భూముల్లో సాగు చేసుకుని జీవన ఉపాధి సాగించుకుంటున్నారని గిరిజన సంఘం మండల నాయకులు ఆర్ దేముడు నాయుడు మాట్లాడుతూ వీళ్లు తాత తండ్రి నుండి ఈ భూములు సాగు చేసుకుని వాళ్ళ పిల్లలు వాళ్ళు పిల్లలు వాళ్ళ తాతలు ముత్తాతలు బతికామని ఈ భూములు సర్వే చేసి మా పేర్లు అడంగల్ లో నమోదు చేసి మాకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రభుత్వాలు మారిన కోణం పంచాయతీలో ఉన్న ప్రజల బతుకు మారలేదని ఇప్పటికైనా మా బతుకు మారేలా ప్రభుత్వం గుర్తించి రీ సర్వే చేసి మా అందరికీ పట్టాలు ఇవ్వాలని కోరుతున్నాము చీడికాడ మండలంలో 23 పంచాయతీలు గాను 21 పంచాయతీ రి సర్వేలు జరిపేశారు కేవలం మా కోణం పంచాయతీ మాత్రమే రీ సర్వే చేయడం లేదు గత గవర్నమెంట్లో సర్వే చేస్తామని చెప్పి పుణ్యకాలం పూర్తయిపోయింది అని ఆరోపించారు ఈ గవర్నమెంట్ లో మా అందరికీ న్యాయం జరిగేలా సర్వే చేసి పట్టాలు మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వార్డ్ నెంబర్ ఏ రాంబాబు టిడిపి ఎస్టిఎల్ కమిటీ చైర్మన్ టి కృష్ణారావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు సిహెచ్ భీమి నాయుడు నూకాలమ్మ రాజలక్ష్మి అప్పలకొండమ్మ తదితరులు పాల్గొన్నారు ఆర్ దేముడు నాయుడు గిరిజన సంఘం