కోర్టు ఆదేశాలను దిక్కరించిన నా ఆస్తులు ధారధరం చేశారు.. ఎమ్మార్వో , వీఆర్వో లపై పిజిఆర్ఎస్ లో ఫిర్యాదు..

పయనించే సూర్యుడు ఏప్రియల్ 7, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) నా రెండో భార్యకు 35 సెంట్లు భూమిని ధారా దత్తం చేశారు.. అంటూ భర్త గరగ వెంకట నాగేశ్వరరావు కలెక్టర్కు పిజిఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు.. వివరాల్లోకి వెళ్తే .. కాకినాడ జిల్లా , పిఠాపురం మండలం ,గోకవాడ గ్రామం లో సర్వే నంబరు 54/7 లో 35 సెంట్లు భూమిని నా రెండో భార్య లోవలక్ష్మికి మా తాతయ్య గరగ తిరుపతిరావు దానపట్టగా రాశారు. తర్వాత ఆమె తిరిగి నా తండ్రిపై, నా తల్లిపై నాపై కేసులు పెట్టి జైలు పాలు చేయడంతో మా తాత వెంటనే దానపెట్టాను క్యాన్సిల్ చేశారని బాధితుడు గరగ వెంకట నాగేశ్వరరావు, తండ్రి బ్రహ్మానందం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోర్టుమాకు ఇచ్చిన తీర్పు ప్రకారం నా చేలోకి వెళ్తే నాపై నా రెండో భార్య తాలూకా మనుషులు నా పై దాడిలు చేసి నన్ను ఇబ్బందులు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నా మొదటి భార్య కు ముగ్గురు పిల్లలు ఉన్నారని నా తండ్రి , నా తల్లి ని నేనే చూసుకుంటున్నానని నాకు ఏ ఆధారం లేదని నాకు భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారని మా తాత ఆస్తి మనవడికే చెందుతుంది కనుక కోర్టు తీర్పు ప్రకారం నా ఆస్తిని నాకు ఇప్పించవలసిందిగా కాకినాడ కలెక్టరేట్ లో పిజిఆర్ఎస్లో ఫిర్యాదు చేయడం జరిగిందని నాకు న్యాయం చేయాలని నా రెండో భార్య నన్ను వేధింపులు గురిచేస్తూ బంధువులతో నన్ను బెదిరిస్తుందని నాకు ప్రాణాపాయం ఉందని మీడియా ద్వారా కోరారు. అలాగే కోర్టు తీర్పును దిక్కరించి నా రెండో కు ఆన్లైన్ ద్వారా భూమిని ఇచ్చిన ఎమ్మార్వో ,వీఆర్వో పై చర్యలు తీసుకోవాలని తెలిపారు.