గత ప్రభుత్వ వైఫల్యాలను సరిదిద్ది. అభివృద్ధి చేయటమే మాధ్యేయం

* బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లొడగల కామేశ్వరరావు

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 7 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్. ఐదేళ్ల వైఎస్ఆర్సిపి పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురై, అధ్వానంగా మారిన కాశీబుగ్గ పెట్రోల్ బంక్-అక్కుపల్లి రహదారికి మోక్షం లభించింది. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష చొరవతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రారంభమైన ఈ కీలక రహదారి నిర్మాణ పనులను, రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి లొడగల కామేశ్వరరావు మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రాష్ట్ర నాయకుడిగా తన బాధ్యతలో భాగంగా ఆయన పనుల పురోగతిని, నాణ్యతను తనిఖీ చేసి, సిబ్బందికి ఆయన పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కామేశ్వరరావు మాట్లాడుతూ, గత ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో కొందరు ‘మేము రోడ్లకు నిధులు తెచ్చాం, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాం’ అని చెప్పి కేవలం గొప్పలు చెప్పుకున్నా రని. వాస్తవానికి నిధులు కేటాయించకుండానే, అభివృద్ధి పేరుతో కొబ్బరికాయలు కొట్టి ఈ రోడ్డును మరింత ధ్వంసం చేసి వదిలేసారని ఆయన విమర్శించారు. వారి చేతకానితనం, నిర్లక్ష్యం కారణంగా ఉద్దాన ప్రాంత ప్రజలకు అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఈ రోడ్డుపై ప్రయాణం ఏళ్లపాటు నరకప్రాయంగా మారిందని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఉద్దాన ప్రాంత ప్రజల తాలూకు కష్టాలను తీర్చడమే లక్ష్యంగా ఎమ్మెల్యే పనిచేస్తున్నారని ఆయన అన్నారు. ఆమె ప్రత్యేక చొరవతో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రహదారికి నిధులు కేటాయించడం జరిగిందని,ఇప్పుడు వేగంగా తారు రోడ్డు పనులు జరుగుతున్నాయనీ , ప్రజలకు ఇబ్బందులు లేకుండా పనులు చేపడతామని ఆయన అన్నారు.ప్రభుత్వ పనులు నాణ్యతతో, వేగంగా జరుగుతున్నాయో లేదో పర్యవేక్షించడం మా బాధ్యత కనుక, ఈ రోజు ఇక్కడికి వచ్చి పనులను పరిశీలించామని. మిగిలిన పనులు కూడా త్వరలోనే పూర్తవుతాయనుీ, మాట తప్పడమే నైజంగా పెట్టుకున్న గత ప్రభుత్వానికి, మాట నిలబెట్టుకునే కూటమి ప్రభుత్వానికి ఉన్న తేడా ఇదేనని, ప్రజలు గమనిస్తున్నారు,” అని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో వారితోపాటు పలాస ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు దడియాల నరసింహులు, తారక రమేష్, జనార్ధన తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *