గొడుగుపల్లి గ్రామంలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

"గొడుగుపల్లిలో సర్పంచ్ మద్దెల వనజ ముందడుగు"

పయనించే సూర్యుడు ఏప్రిల్ 7 రాజేష్ దౌల్తాబాద్) దౌల్తాబాద్ మండలంలోని గొడుగుపల్లి గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు గ్రామ సర్పంచ్ మద్దెల వనజ చురుకైన చర్యలు చేపట్టారు. గ్రామంలోని బీసీ కాలనీలోని టు బిహెచ్‌కే ఇండ్లకు మిషన్ భగీరథ ద్వారా నీరు సరఫరా కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న ఆమె వెంటనే స్పందించారు. గ్రామ ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించిన సర్పంచ్ వనజ, నీటి కొరతను తక్షణమే తొలగించేందుకు కొత్త పైప్‌లైన్ ఏర్పాటు చేయించారు. ఈ చర్యతో కాలనీలోని కుటుంబాలకు తాగునీరు అందుబాటులోకి రావడంతో ప్రజలు ఉపశమనం పొందారు. సర్పంచ్ తీసుకున్న ఈ నిర్ణయం గ్రామంలో ప్రశంసలు పొందుతోంది. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మధ్యలో స్వామి, ఉప సర్పంచ్ దుర్గని దీపిక, పంచాయతీ కార్యదర్శి మల్లేశం, గ్రామ నాయకులు నరేష్, మద్దెల మల్లేష్, కుమార్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు కూడా పెద్ద ఎత్తున హాజరై సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామని సర్పంచ్ వనజ పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టి, సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఈ చర్యతో గొడుగుపల్లి గ్రామంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *