పయనించి సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 07,2026, గోనెగండ్ల రిపోర్టర్ సురేష్ గోనెగండ్లలో ట్రాఫిక్ సమస్య రోజు రోజుకు పెరుగుతున్న నియంత్రణ లోపాల కారణంగా ప్రమాదాల భారిన పడి మృత్యువాత పడుతున్నారు,రోడ్డు విస్తరణ పనులు చేయాలి ప్రభుత్వ వైద్యశాల స్థాయినీ పెంచి పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి మండల కేంద్రంలోని గొనెగండ్ల బస్టాండ్ సమీపంలో గ్రామీణ ప్రాంతాల ప్రజల కోసం ప్రయాణికుల కోసం నూతన బస్సు ప్రాంగణం సులభ్ కాంప్లెక్స్ లు ఏర్పాటు చేయాలి జల్ జీవన్ పనులను వేగవంతం చేసి నిలిచిన ఓవర్ హెడ్ ట్యాంక్ పనులు పూర్తిచేసి పేదలకు త్రాగునీటినీ అందించాలి చింతలముని స్వామి ముఖద్వారం నుంచి దేవాలయం వరకు రోడ్డు నిర్మాణం చెపట్టాలి. ముస్లిం మైనారిటీ ప్రజల కొరకు అసంపూర్తిగా నిర్మించిన షాదిఖానా ను పూర్తిచేయాలి. 10 వ వార్డులో అసంపూర్తిగా నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని పూర్తి చేయాలి. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పునాదుల దగ్గర పెచ్చులు ఊడిన బిల్డింగ్ కు మరమ్మతులు చేయించాలి. ముస్లిం ప్రజల స్మశాన వాటికలో స్థలాలు ఆక్రమించుకొని ఇంటి నిర్మాణాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. గోనెగండ్ల గ్రామంలోని ముఖ్యమైన 9 ప్రధాన సమస్యలపై పరిష్కారం కోరుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కర్నూలు జిల్లా కలెక్టర్ గారికి వేరు వేరుగా అర్జీలు సమర్పించినట్లు గోనెగండ్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముల్లా ఖాసిం వలి, నజీర్, సోగ్గాడు, శేషాద్రి తెలిపారు.