
పయనించే సూర్యుడు ఏప్రిల్ 7 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ కర్నూలు నగరంలో జూబ్లీ ఫంక్షన్ హాల్ లోఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుబ కురుమ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సమ్మేళానికి ముఖ్య అతిథులుగా కురుబ కుల బాంధవులు రాజకీయ నాయకులు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు ఎస్ సవిత మరియు కర్నూల్ పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు* హాజరవడం జరిగింది చైర్మన్ మాట్లాడుతూ ఈ సమ్మేళనం ఆంధ్రప్రదేశ్ కురుబ కురుమ బంధువులకు ఎంతో ప్రతిష్టాత్మకం,నా ఒక్క మాటకు ఈ రోజు రాష్ట్రంలో గ్రామస్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి అందరు వచ్చినందుకు కురుబ-కురుమ కుల బంధువులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను* రాష్ట్రంలో కురుబ కురుమ రాయలసీమలో మాత్రమే కాదు కోస్తా ఆంధ్రలో కూడా ఉన్నారని నిరూపించుకున్నరు నా కుల బంధువులకు నా యొక్క నమస్కారము మేము ఆర్థికంగా విద్యాపరంగా వ్యాపారాలపరంగా అన్నిరంగంలో ఉన్నాము కానీ రాజకీయంలో మాత్రం మన రాష్ట్రంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో మాత్రం గుర్తించారు కానీ కర్నూల్ లో కూడా మన కులస్తులు రాజకీయంగా కూడా ఎదిగే శక్తి ఉందని చూపించాము మాకు ఇచ్చిన కర్నూల్ పార్లమెంటు గెలిపి చూపించాం అంతేకాదు వేరే జిల్లాలో కూడా మన కులస్తులు బలిష్టంగా ఉన్నారని ఈరోజు కళ్ళారా మిమ్మల్ని చూస్తున్నాను రాష్ట్రంలో కొద్ది రోజులకు స్థానిక ఎలక్షన్లో వస్తున్నాయి అందులో కూడా మనము మన కులస్తులను నిలబెట్టి గెలుచుకుందాం అంతేకాదు వచ్చే సార్వత్రిక ఎన్నికల లోపు ఇంకా కొన్ని నియోజకవర్గాలు పెరుగుతున్నాయి అందులో కూడా మనము పోటీ చేయాలంటే మనము మన కులస్తులందరూ ఏకతాటిగా నిలబడాలి, అప్పుడు మాత్రం రాజకీయ పార్టీలు మన కులస్తులను గుర్తించి టికెట్ ఇస్తాయి అందుకోసమే రాష్ట్రస్థాయి కమిటీని కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ కమిటీలో కులం కోసం కుల అభివృద్ధి కోసం నిస్వార్ధంగా పనిచేసే నాయకులు ముఖ్యంగా యువకులు ముందుకు రావాలని పిలుపునిచ్చినారు అందుకు మన కులస్తులందరూ ఏకతాటిగా నా మాటను గౌరవించి వచ్చినారు, మినిస్టర్ సవిత మరియు కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు నేతృత్వంలో రాష్ట్ర కమిటీ చేసుకోవడం మంచిది అని నిర్ధారించి ఈరోజు రాష్ట్ర కమిటీ లో నిస్వార్ధంగా కులం కోసం పని చేసే నాయకులు పేర్లు ఇవ్వండి అంటే చాలామంది పేర్లు వచ్చినాయి కానీ అందులో మన కుల పెద్దలందరూ కూర్చొని కమిటీని ఏర్పాటు చేసుకొని రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈశ్వరయ్య, జగదీష్, రెడ్డి ప్రసాదు, జయప్ప, అర్జున్ రావు, రెడ్డప్ప, రాగే పరశురాం, బిజెపి రాజేష్, ఎస్ కే మల్లికార్జున, సర్పంచ్ కురువ సుధాకర్, కార్పొరేషన్ డైరెక్టర్లు* మరియు మన కుల పెద్దలు యువకులు రైతులు పాల్గొన్నారు.