ఘనంగా బిజెపి ఆవిర్భావ దినోత్సవం

పయనించే సూర్యుడు-07-04-2026-రాజంపేట న్యూస్ : సోమవారం వై.బి.యన్ పల్లిలో భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీశైలం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఈ సందర్బంగా పోతుగుంట మాట్లాడుతూ అంత్యోదయ స్ఫూర్తితో సుపరిపాలన లక్ష్యంగా.. సేవయే పరమావధి – దేశమే ప్రథమం అంటూ జనసంఘ్ కాలం నుండి నేటి వరకు పార్టీ జెండాను మోసిన మహనీయుల త్యాగాలను స్మరించుకుందామన్నారు. దేశ సేవకే అంకితమై, నిరంతరం శ్రమిస్తున్న కోట్లాది మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఓబీసీ మోర్చ పూర్వ రాష్ట్ర కార్యదర్శి పట్టు పోగుల ఆదినారాయణ, ఎస్సీ మోర్చా జోనల్ ఇంచార్జ్ రమణయ్య, బిజెపి పట్టణ అధ్యక్షులు వి.వి రమణ, పట్టణ ప్రధాన కార్యదర్శి గిరీష్, మాజీ మండలాధ్యక్షురాలు ప్రభావతి, బిజెపి సీనియర్ నాయకుడు తోట నగేష్, రాజంపేట పట్టణ కార్యదర్శి శివమణి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *