
పయనించే సూర్యుడు: 07-04-2026 సత్తుపల్లి రూలర్: రిపోర్టర్: గద్దె.విజయ బాబు సత్తుపల్లి రూరల్ మండల అధ్యక్షులు సాలి శివకృష్ణ ఆధ్వర్యంలో, మండల ప్రధాన కార్యదర్శి వేముల లక్ష్మీనారాయణ అధ్యక్షతన బిజెపి ఆవిర్భవ దినోత్సవ వేడుకలు మండలంలోని కిష్టాపురం, పాకల గూడెం, గంగారం, కాకర్లపల్లి, రేజర్ల గ్రామాలలో వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా ప్రధాన కార్యదర్శి నాయుడు రాఘవరావు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశం ప్రపంచంలోనే అత్యున్నత స్థాయికి ఎదుగుతుందని, దీనికి పూర్తి బాధ్యత ప్రధాని నరేంద్ర మోడీ తీసుకుని ముందుకువెళుతున్నారన్నారు ఆనాడు రెండు సీట్లతో ప్రారంభమైన భారతీయ జనతా పార్టీ ప్రస్థానం నేడు కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావడంతో పాటు,19 రాష్ట్రాలలో అధికారంలో కొనసాగుతుందని, దీనికి కారణం కార్యకర్తల శ్రమ, పార్టీ పట్ల నిబద్ధత, నిజాయితీయే అన్నారు. భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా అధికారం చేపడుతుందని అన్నారు రాష్ట్రంలో ప్రజలలో ఒక చర్చ జరుగుతుందని ఈసారి ఏదేమైనా బీజేపీకి పట్టం కట్టాలని నిర్ణయానికి వచ్చారన్నారు అంతేగాక ఖమ్మం జిల్లాలో కూడా పార్టీ పోలింగ్ బూత్ స్థాయికి విస్తరిస్తుందన్నారు కార్యకర్తల సంఖ్యాబలం అనూహ్యంగా పెరుగుతుందని పెద్ద నాయకుల చూపు భారతీయ జనతా పార్టీపై ఉందని, ప్రజలు కూడా బిజెపికి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు ఈ సందర్భంగా కార్యకర్తలకు, ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వందనపు భాస్కర రావు, పమ్మి నరసింహారావు,మండల నాయకులు చీకటి వసంతరావు,ధరావత్ రామారావు,ఒట్టే పోతురాజు, పబ్బు అప్పారావు,మరియు కార్యకర్తలు,ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
