పయనించే సుర్యుడు న్యూస్ చండూరు ఏప్రిల్.07. చండూరు మండలం కస్తాల గ్రామంలో రైతు వేదిక వద్ద మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చండూరు మండల తహసిల్దార్ రమాకాంత్ శర్మ ప్రారంభించారు. ప్రభుత్వం అందించే మద్దతు ధరను ప్రతి ఒక్క రైతు వినియోగించుకోవాలని రైతులకు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు అమ్ముకోవాలని రైతులకు సూచించారు. మధ్య దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్వింటాకు రూ.2389/- మద్దతు ధర కల్పిస్తుందని, మిల్లర్లకు క్వింటాకు రూ.16-17 వందలకు అమ్మి మోసపోవద్దని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. రైతులు శ్రమించి పండించిన ప్రతి ధాన్యాన్ని ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేస్తుందని తెలిపారు. నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి, ప్రభుత్వం నిర్ణయించిన గిట్టుబాటు ధరలు పొందాలని రైతులను ఆయన కోరారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఎవరూ ఇబ్బందులు పడకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కస్తాల గ్రామ సర్పంచ్ లేదన్న సత్యం,ఉప సర్పంచ్ కట్ట స్వర్ణ ,మార్కెట్ కమిటీ ఛైర్మెన్ దోటి నారాయణ ,మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మెన్ పోలు వెంకట్ రెడ్డి,మార్కెట్ కమిటీ డైరెక్టర్ భూతరాజు అంజనేయులు , ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సీఈఓ అమరేందర్ రెడ్డి , ఐకేపీ సెంటర్ నిర్వాహకులు భూతరాజు ఫనీంద్రా , ,కస్తాల గ్రామ రెవెన్యూ అధికారి యాదయ్య , వీఏఓ శ్రీలేఖ కాంగ్రెస్ పార్ట్ సీనియర్ నాయకులు మెరుగు అంజయ్య , మెండు చంద్రా రెడ్డి మరియు రైతులు , హమాలీలు పాల్గొన్నారు.
