చారిత్రక ఆలయానికి కేంద్రం నుంచి భారీ నిధులు

ఎంపీ డా.కడియం కావ్య పట్టుదలతో కాకతీయుల వైభవానికి పునర్జీవంఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు

పయనించే సూర్యుడు ఏప్రిల్ 7 (జనగామ ప్రతినిధి కమ్మగాని నాగన్న)వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మరో కీలక మైలురాయిని సాధించారు. చారిత్రక ప్రాధాన్యం కలిగిన హనుమకొండలోని రుద్రేశ్వర స్వామి వేయి స్తంభాల గుడి అభివృద్ధి కోసం కేంద్రం నుంచి భారీ నిధులు మంజూరు కావడంలో ఎంపీ డా.కడియం కావ్య కృషి ఫలించింది. వేయి స్తంభాల ఆలయం, అదే ప్రాంగణంలోని కల్యాణ మండపం అభివృద్ధి, విస్తరణతో పాటు మిగిలిపోయిన పునరుద్ధరణ పనుల కోసం రూ.14.44 కోట్ల నిధులు మంజూరు చేయించడంలో ఎంపీ కడియం కావ్య కీలక పాత్ర పోషించారు. ఈ నిధులతో కాకతీయుల కాలం నాటి శిల్ప వైభవాన్ని తిరిగి తీసుకురావడమే లక్ష్యంగా పనులు చేపట్టనున్నారు. గతంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ ని పలుమార్లు కలిసి, వేయి స్తంభాల గుడి అభివృద్ధి అవసరాన్ని వివరిస్తూ ఎంపీ చేసిన నిరంతర ప్రయత్నాలే ఈ ఫలితానికి కారణం అయ్యాయి గతంలో పురావస్తు శాఖ అధికారులతో కలసి స్వయంగా ఆలయాన్ని సందర్శించి, పునరుద్ధరణ అవసరాలను అధ్యయనం చేసిన ఎంపీ డాక్టర్ కడియం కావ్య, వెంటనే కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించారు. ఇటీవల కేంద్ర పురావస్తు శాఖ పనులకు టెండర్లు పిలవడంతో పనులు ప్రారంభానికి రంగం సిద్ధమైంది. ఈ సందర్భంగా వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో పాటు పురావస్తు శాఖ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. పనులు త్వరితగతిన పూర్తి చేసి, ఆలయానికి పూర్వ వైభవం తీసుకురావాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు. గత ఏడాది కేంద్ర మంత్రిని కలసి సుమారు రూ.15 కోట్ల నిధులు మంజూరు చేయాలని వినతి పత్రం అందజేసిన విషయం గుర్తు చేస్తూ, అందుకు సానుకూలంగా స్పందించిన కేంద్రం రూ.14.44 కోట్లు కేటాయించడం వరంగల్ అభివృద్ధికి శుభసూచకమని పేర్కొన్నారు. కాకతీయుల శిల్ప కళా సంపదకు ప్రతీకగా నిలిచిన వేయి స్తంభాల గుడి అభివృద్ధి ద్వారా పర్యాటక రంగం మరింతగా అభివృద్ధి చెందడంతో పాటు స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య అన్నారు వారసత్వాన్ని కాపాడుతూ అభివృద్ధిఅనే లక్ష్యంతో ముందుకు సాగుతూ వరంగల్ లో నూతన ప్రాజెక్టుల సాధన కోసం అహర్నిశలు కృషి చేస్తున్న వరంగల్ ఎంపీ డా.కడియం కావ్యకి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *