పయనించే సూర్యుడు ఏప్రిల్ 7 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని చేజర్ల మండలం లో ఘనంగా నిర్వహించారు. సోమవారం మండల కేంద్రంలోని బోడిపాడు సెంటర్ వద్ద బీజేపీ మండల నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన బీజేపీ ఆవిర్భావ దినోత్సవానికి బీజేవైఎం జిల్లా అధ్యక్షులు భరత్ రెడ్డి, రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ కిష్టయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భరత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మన ఊరు – మన జెండా కార్యక్రమం లో భాగంగా ఈరోజు మండలం లో మొదటి జెండా ఆవిష్కరణ చేశామన్నారు. కిష్టయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పాల్గొన్నారు