పయనించే సూర్యుడు 7.4.2026 రిపోర్టర్ :శ్రవణ్ రాజ్ అనకాపల్లి జిల్లా చోడవరం ప్రారంభోత్సవానికి విచ్చేసిన,, స్థానిక ఎమ్మెల్యే కె ఎస్ ఎన్ ఎస్ రాజు, చోడవరం మండలంలోని జుత్తాడ గ్రామంలో వెలసియున్న శ్రీ శ్రీ లక్ష్మీ స్వరూప పట్టాలమ్మ తల్లి వచ్చే నెలలో అతి వైభవంగా జరిగే పండగ పురస్కరించుకొని ఈ నేపథ్యంలో జుత్తాడ గ్రామ శివారు శ్రీ శ్రీ దుర్గాలమ్మ తల్లి ఆలయ సమీపంలో గవర రాజు వరాల మడి మైదానంలో సోమవారం ఉదయం 11 గంటలకు చోడవరం స్థానిక ఎమ్మెల్యే కె ఎస్ ఎన్ఎస్ రాజు పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు సమక్షంలో క్రీడా మైదానంలో కొబ్బరికాయ కొట్టి క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ప్రారంభోత్సవం చేశారు,, తదనంతరం ఎమ్మెల్యే కె ఎస్ ఎం ఎస్ రాజు క్రీడా మైదానంలో ముందుగా బ్యాట్ పట్టుకొని ఉల్లాసంగా క్రికెట్ ఆడారు, అలాగే గవర కార్పొరేషన్ డైరెక్టర్ బొడ్డు గంగాధర్ కాసేపు బ్యాట్ పట్టుకొని క్రికెట్ ఆడారు, ఈ కార్యక్రమం ఉద్దేశించి మాజీ సర్పంచ్, పట్టాలంతల్లి ఆలయ కమిటీ చైర్మన్ పేలా వెంకట్ గణేష్ మాట్లాడుతూ గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు భక్తుల సహకారంతో పట్టాలమ్మ తల్లి పండుగను వైభవంగా విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నామని ఒక ప్రకటనలో తెలిపారు ఈ కార్యక్రమంలో గవర కార్పొరేషన్ డైరెక్టర్ గంగాధర్, మాజీ జెడ్పిటిసి కాని శెట్టి మచ్చి రాజు,, జుత్తడ గ్రామ మాజీ సర్పంచ్ దొడ్డి ప్రసాదు,, పట్టాలమ్మ తల్లి ఆలయ కమిటీ చైర్మన్ పేల వెంకట గణేష్,, కోపరేటివ్ సొసైటీ చైర్మన్, దొడ్డి రామారావు,, అలాగే మాజీ సర్పంచ్,, మల్ల వెంకట సత్యనారాయణ,, గ్రామ పార్టీ అధ్యక్షులు దొడ్డి శివ మరియు పంచాయతీ పాలకవర్గ సభ్యులు గ్రామ ప్రజలు పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు