పయనించేసూర్యుడు మేజర్ న్యూస్ ఏప్రిల్ 07.04.2026 మదనపల్లి అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ0 ప్రతినిధి జె. నాగరాజు) తిరుమల శ్రీవారి హుండీలో రద్దయిన రూ.500, రూ.1000 నోట్ల ప్రవాహం ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతం టీటీడీ వద్ద సుమారు రూ.400 కోట్లుపాత నోట్లు పోగుపడ్డాయి. కేంద్ర ప్రభుత్వం లేదా ఆర్బీఐ వీటి మార్పిడికి అనుమతి నిరాకరించడంతో ఈ భారీ మొత్తం నిరుపయోగంగా మారింది. మరోవైపు రూ.2000 నోట్లను మాత్రం బ్యాంకులు స్వీకరిస్తున్నాయి. భక్తుల కానుకలను వృధా పోనివ్వకుండా కేంద్రం తక్షణమే స్పందించాలని కోరుతున్నారు.