దళిత క్రైస్తవులను ఎస్సీలు కాదనడం సరికాదు

దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాల్సిందే.సుప్రీంకోర్టు తీర్పునుఉపసంహరించుకోవాలి ..

పయనించే సూర్యుడు ఏప్రిల్ 7 కర్నూలు జిల్లా ఇన్చార్జ్ శ్రీకాంత్. దేశంలో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా రద్దు చేయడం సరికాదని చిత్తశుద్ధి ఉంటే కుల వ్యవస్థనే రద్దు చేయాలని దళిత హక్కుల పోరాట సమితి (డి హెచ్ పి ఎస్) డిమాండ్ చేశారు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కొనసాగించాలని సుప్రీంకోర్టు తీర్పును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో దళిత క్రైస్తవులను కలుపుకొని సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమం కొత్తూరు ఈరన్న అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా డి హెచ్ పి ఎస్ జిల్లా సహాయ కార్యదర్శి వీరేష్ డి హెచ్ పి ఎస్ నియోజకవర్గ కార్యదర్శి విజయ్ కుమార్ ఏ సి యు సి సంఘ పట్టణ కార్యదర్శి ఆనంద రాజు వివిధ సంఘాల పాస్టర్లు మాట్లాడుతూ దేశంలోని క్రైస్తవ మత ప్రచారకులు అంతా అగ్రకులాల వారే ఉన్నారని వారికి లేని నిబంధనలు దళిత క్రైస్తవులకు మాత్రమే ఎందుకని ప్రశ్నించారు ఎస్సీల మత స్వేచ్ఛని హరించే 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధం కుల వివక్షను రూపుమాపడం చేతకానప్పుడు కుల వ్యవస్థనే రద్దు చేయాలన్నారు సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 15 పూర్తి విరుద్ధంగా ఉందన్నారు క్రైస్తవం లోకి మారిన అగ్రకులాల వాళ్ళు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పొందుతున్నప్పుడు అదే పని చేసిన దళితులు ఎస్సీ రిజర్వేషన్లు ఎందుకు పొందకూడదో చెప్పాలన్నారు 1956లో సిక్కు దళిత క్రైస్తవులకు 1990లో బౌద్ధ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించారు దేశవ్యాప్తంగా ఉన్న దళిత క్రైస్తవులకు కూడా ఎస్సి హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం లో ఏఈఓ కు వినతి పత్రం అందజేశారు ఈ హెచ్ పి ఎస్ గౌరవ ఆధ్యక్షులు ప్రకాష్ డిహెచ్పిఎస్ పట్టణ కార్యదర్శి కుమారస్వామి సుజ్ఞానమ్మ ఏసీ యూసీ అధ్యక్షులు అధ్యక్షులు ఎజ్రా శ్రీధర్ సిపిఐ పట్టణ సహకార దర్శి రమేష్ ఏఐవై ఇ కార్యదర్శి అంజిత్ గౌడ్ సిపిఐ మండల కార్యదర్శి ఎల్లప్ప సత్యనారాయణ ఏసుదాస్ లాలప్ప పుష్ప రాజ్ వీరేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *