పయనించే సూర్యుడు న్యూస్ 07,2026 గోనెగండ్ల రిపోర్టర్ సురేష్ మండల పరిధిలోని అగ్రహారం గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ ధర్గమ్మ దేవర సందర్భంగా, గ్రామంలో తీవ్ర మంచినీటి కొరత నెలకొనడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను స్థానిక నాయకులు మాజీ సర్పంచ్ రంగారెడ్డి, మాల ముని నుకుల వెంకటేష్, నుకుల శేఖర్, ఉపేంద్ర , మాల పెద్దయ్య, మనోహర్, జయరాం, రంగస్వామి, రాజు, ఇమ్మనియల్ వెంకటరాముడు తదితరులు కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూల్ పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ పార్లమెంట్ సభ్యురాలు బుట్టా రేణుకమ్మకు తెలియజేశారు. సమస్యపై వెంటనే స్పందించిన బుట్టా రేణుక తమ భర్త మరియు బుట్టా ఫౌండేషన్ అధినేత బుట్టా శివ నీలకంఠ కు సమాచారం అందించారు. దీనిపై స్పందించిన బుట్టా శివ నీలకంఠ బుట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో తక్షణమే మంచినీటి ట్యాంకర్లను అగ్రహారం గ్రామానికి పంపించి, గ్రామ ప్రజలకు తాత్కాలికంగా తాగునీటి సౌకర్యం కల్పించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు తమ సమస్యను పరిష్కరించడానికి తక్షణ చర్యలు తీసుకున్నందుకు బుట్టా రేణుక మరియు బుట్టా ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.